డిగ్రీ చేసిన విద్యార్థులకు ఈ కోర్స్‌తో మంచి భవిష్యత్
- February 14, 2018
కొంతమంది యువత కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్ చేస్తే జాబ్ రాదు. వీళ్లు ఏదైనా కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి కొన్ని కోర్సులు బాగా ఉపయోగపడతాయి. అందులో ఎథికల్ హ్యాకింగ్ మొదటిది. హ్యాకింగ్ అంటే అనుమతి లేకుండా మన ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి (కంప్యూటర్లు) ప్రవేశించడం. మన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వారిని దొంగలు అని ఎలా అంటామో వీరు కూడా అంతే. హ్యాకర్ అనే పదం 1980ల్లో మొదటిసారి వాడుకలోకి వచ్చింది. ఈ పదానికి వేర్వేరు అర్థాలున్నప్పటికీ ప్రధానంగా హ్యాకింగ్ అనే అర్ధంతోనే ప్రపంచానికి తెలుసు. ఈ ప్రమాదాన్ని కట్టడి చేసే పనినే ఎథికల్ హ్యాకింగ్ అని పిలుస్తారు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఎథికల్ హ్యాకింగ్ ఎక్సపర్ట్ లు అవసరముంది. వీరు ఎక్కువగా సంస్థల కోసం పని చేస్తారు. తాము పని చేసే సంస్థల ఆన్‌లైన్ భద్రతను పరీక్షిస్తారు. తమ సంస్థల వెబ్‌సైట్లను తామే హ్యాక్ చేస్తారు. తద్వారా కంపెనీల ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరచడమే వీరి పనిగా ఉంటుంది.
అయితే ఈ టెక్నాలజీ ని నేర్చుకోవడానికి ఎక్కువగానే సమయాన్ని వెచ్చించాలంటున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు.. ఈ క్రమంలో నేర్చుకున్నాక వచ్చే ప్రయోజనాలు కూడా భారీగానే ఉంటాయని చెబుతున్నారు. ఒక్కోదేశంలో వివిధ కంపెనీలకు వందల్లో ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్‌పర్ట్ లు అవసరంగా టెకీలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కష్టమనో లేక ఖర్చుకు వెనుకాడో భారతదేశంలో ఆ కోర్సులు చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. అయితే కాస్తంత ఓపిక తెచ్చుకుని ఈ కోర్సును నేర్చుకుంటే భవిష్యత్ బంగారమే అంటున్నారు.. సో.. డిగ్రీ చేసి జాబ్ చేయాలనుకునే వారికి ఈ కోర్స్ మంచి అవకాశమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







