మెగా హీరోయిన్ నిహారిక మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- February 14, 2018
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఇటీవల హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. హ్యాపీ వెడ్డింగ్ చిత్రం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆరంభంలో విడుదల కానుంది. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేలంటైన్స్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది మెగా ఫ్యాన్స్‌లో వైబ్రేషన్స్ కలుగజేస్తుంది. ఇక నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న తమిళ చిత్రంలోను నటిస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిహారిక రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నట్టు టాక్ .
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి