అమ్మాయిల కోసం చైనాలోని రెస్టారెంట్ ఓ ఆఫర్
- February 15, 2018
అమ్మాయిల కోసం చైనాలోని రెస్టారెంట్ ఓ ఆఫర్‌ని స్టార్ట్ చేసింది. అది అందరి అమ్మాయిల కోసం కాదటండీ అందంగా ఉండాలట. మరి ఎవరికి వారు అందంగానే కనిపిస్తారు కదా అంటే.. అయ్యో మీరు అలా అనుకుంటే చాలా కష్టం. మీరు అందంగా ఉన్నారో లేదో మేము మాత్రమే డిసైడ్ చేస్తాం. వారిని మాత్రమే లోపలికి రానిస్తామంటోంది బీజింగ్‌లోని ఈ 'హెన్ జూ' రెస్టారెంట్. అందంగానే కాదండోయ్ వెయిట్ కూడా 34.5 కంటే అరకేజీ కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదంట. ఇక హైట్ కూడా ఆరడగులకు దగ్గర్లో ఉండాలంట.
మరి ఈ లక్కీ లేడీని సెలక్ట్ చేయడానికి ఓ మెషీన్‌ను ఏర్పాటు చేసింది రెస్టారెంట్. ముందుగా పేస్‌ను స్కాన్ చేస్తే అది అందంగా ఉన్నారో లేదో చెప్పేస్తుందంట. ఇలా ప్రతి అయిదుగురు అమ్మాయిల్లో ఒకరిని సెలక్ట్ చేసి ఫ్రీ మీల్స్ అందిస్తారు. అరగంటకోసారి ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తారు. చైనాలోని చాలా రెస్టారెంట్లలో ఇలాంటి ఆఫర్లు ఉంటాయట. ఇదేదో బాగానే ఉంది కానీ అందంగా ఉంటేనే అన్నం పెడతాననడం అస్సలు బాలేదు. కస్టమర్స్‌ని ఆకర్షించడానికి బిజినెస్‌లో ఇదో ట్రిక్కుగా సరిపెట్టుకోవాలేమో.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







