రేపు హైదరాబాద్‌కు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ
- February 15, 2018
హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ .. హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఇరాన్ అధ్యక్షుడు రోహనీ.. నగరంలోని గోల్కొండ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. మసీదులో ప్రార్థనల అనంతరం ఆయన మత పెద్దలతో సమావేశం నిర్వహించనున్నారు. రోహనీ రాక సందర్భంగా ఇరానియన్ ఆయిల్ కంపెనీతో భారతీయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ భారత్‌కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో రోహనీకి స్వాగతం తెలుపనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







