మవసలాత్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ధరలు
- February 15, 2018
మస్కట్: మవసలాట్ ట్యాక్సీ సర్వీసులకు సంబంధించి ఆదివారం నుంచి ధరలు 50 శాతం వరకు (బేస్ ఫేర్) తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), 3 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఇప్పటిదాకా ఈ ధరలు 6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే కిలోమీటర్‌కి 200 బైసాస్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ధరలు చెల్లుబాటవుతాయి. అయితే ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు మినిమమ్ ఛార్జ్ 5 ఒమన్ రియాల్స్‌గా నిర్ణయించారు. రాత్రి 10 గంటల తర్వాత రేట్లు 3.6 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. కిలోమీటర్‌కి 450 బైసాస్ (30 కిలోమీటర్ల వరకు), 30 కిలోమీటర్లు దాటితే 200 బైసాస్ కిలోమీటర్‌కి చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను నడపనున్నట్లు మవసలాట్ ఇదివరకే ప్రకటించింది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







