డ్రగ్స్ ట్రాఫికింగ్: ఒకరి అరెస్ట్
- February 15, 2018
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని దుబాయ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. తన దుస్తుల్లో డ్రగ్స్‌ని దాచి డ్రగ్స్‌ని నిందితుడు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వదేశంలో తన సోదరుడి ద్వారా ఈ డ్రగ్స్‌ని దుబాయ్‌లోకి నిందితుడు తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఈద్ మొహమ్మద్ తని హరీబ్ మాట్లాడుతూ, ఈ తరహా డ్రగ్స్ అక్రమ రవాణాని కనుగొనడం చాలా కష్టమని, అత్యంత చాకచక్యంగా తమ డిపార్ట్‌మెంట్ ఈ స్మగ్లింగ్‌ని గుర్తించిందని అన్నారు. ఓ హోటల్ ముందు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో నిందితుడ్ని కనుగొని, రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారించి, మొత్తంగా అతన్నుంచి 283 కిలోల డ్రగ్స్‌ని సీజ్ చేశారు. నార్కోటిక్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







