బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- February 15, 201820 నెలల బాలిక, వాటర్ బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అల్ ధైద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్ళి అక్కడే, నీరు నిండి వున్న బకెట్లోకి దిగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి బయటకు వెళ్ళగా, ఇంట్లోనే వున్న తల్లి ఫోన్లో మాట్లాడుతూ వుంది. మరో చిన్నారి టీవీ చూస్తూ ఉన్నట్లు తల్లి చెప్పింది. ఫోన్లో మాట్లాడటం పూర్తయ్యాక, చిన్నారి కోసం వెతికిన తల్లికి బకెట్లో అచేతనావస్థలో పడిన చిన్నారి కన్పించింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించారు. బకెట్లోకి దిగగానే చిన్నారి నీటిని ఎక్కువగా తాగేసిందనీ, ఆ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందనీ వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?