దుబాయ్ లో దుస్తుల మడతలలో మాదకద్రవ్యాలను దాచి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

- February 15, 2018 , by Maagulf
దుబాయ్ లో దుస్తుల మడతలలో మాదకద్రవ్యాలను దాచి  అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

దుబాయ్: ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి  మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే సమాచారంతో మాదకద్రవ్యాల వ్యతిరేక దుబాయ్ పోలీస్ విభాగం అరెస్టు చేసింది. తన సొంత దేశంలో నివసించే సోదరుడి సహకారంతో దుస్తుల మడతల్లో రహస్యంగా దాచిపెట్టి మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకొంటున్నట్లు యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఈద్ మహమ్మద్ థానీ హరిబ్ తెలిపారు. నిందితుడు  ఉపయోగించిన అరుదైన పద్ధతి రహస్యతను కనుగొనడం అంత సులభం కాదని  వాటిని దుస్తుల మడతలలో అత్యంత గోప్యంగా నిందితుడు దాచాడని చెప్పారు. "ఆపరేషన్ 'ఫోల్డ్' కింద, పోలీసులు హోటల్ వద్ద అరెస్టు చేశారు, ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి  మాదక ద్రవ్యాలకు పంపిణీ చేయడానికి అక్కడ  నిల్వచేశారు.ఆ మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే వ్యక్తిని పట్టుకొనే ఆపరేషన్ విజయవంతమైనది. మేజర్ జనరల్  ప్రత్యక్ష ,ఖచ్చితమైన సమాచారం అందడంతో దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి,  మరియు నేర దర్యాప్తు విభాగం చీఫ్ అసిస్టెంట్ కమాండర్- ఇన్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్-మన్సోరి పర్యవేక్షణలో ఆ నిందితుడిని పట్టుకొన్నారు. ఆసియా దేశానికి చెందిన మాధకద్రవ్యాల రవాణా చేసే నిందితుడు  దుబాయ్,ఇతర ఎమిరేట్స్ లో తన ప్రాంతాన్ని మాదకద్రవ్యాలతో లోడ్ చేస్తూ అనేక ప్రాంతాల్లోకి దాచడం జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం మాదకద్రవ్యాలు 283 కిలోలు మరియు 20 కిలల క్రిస్టల్ మెత్ కు అదనంగా మూడు రకాలైన మాదక ద్రవ్యాల మాత్రలు, సైకోట్రోపిక్ పదార్ధాలను స్వాధీనం చేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు పంపించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com