జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ కు అంతా రెడీ

- February 16, 2018 , by Maagulf
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ కు అంతా రెడీ

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఆహ్వానించానని, కానీ వారు రాలేదని, అందుకు కారణాలు తనకు తెలియవని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ కు వచ్చిన ఆయన, కమిటీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏపీకి విభజన హామీల అమలు విషయంలో టీడీపీ, వైకాపా నేతలు వాళ్ల పంథాలో పోరాడుతూనే ఉన్నారని అన్నారు. జేఎఫ్సీ సమావేశాలు తరచుగా కొనసాగుతాయని, ఈ భేటీ తరువాత సబ్ కమిటీలను వేసే ఆలోచనలో ఉన్నామని కూడా పవన్ తెలియజేశారు. చాలామంది జేఎఫ్సీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అంతకుముందు.. ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పవన్‌ అభిమానులు పెద్దసంఖ్యలో నినాదాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com