అనుమానంతో భార్యపై యాసిడ్ పోసి అంతమొందించిన దుర్మార్గ భర్త
- February 16, 2018_1518787464.jpg)
అబుదాబి : తన వైపు అనేక తప్పులు ఉంచుకొని..ఓ కఠినాత్ముడు తన భార్యపై యాసిడ్ పోసి క్రూరంగా హత్య చేశాడు. వివరాలలోకి వెళితే యూఏఈ లో నివసిస్తున్న నిందితుడు మాయమాటలు చెప్పి ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మాధకద్రవ్యాల అక్రమరవాణా కేసులో ముద్దాయి..అలాగే నకిలీ చెక్కుల మార్పిడిలో మోసానికి పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తాను ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి వలలో చిక్కుకొన్నానని నిందితుడి భార్య..ఆ నిందితుడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనను విడాకులు కోరిన భార్యపై ప్రతీకారం పెంచుకున్నాడు. ఆమెను అనుమానించాడు . తనను విడాకులు కోరండంతో ఆ మహిళను చంపివేయాలని జైలులోనే పతాక రచన చేశాడు.జైలు నుంచి విడుదలై ఇంటికి వెళుతూ దారిలో ఒక యాసిడ్ సీసా కొన్నాడా దుర్మార్గుడు.‘‘ ఎందుకు విడాకులు నన్ను కోరావు అని పదే పదే వేధించాడు..నీకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది. అందుకే నన్ను వదిలించుకొంటున్నావని భార్య మొబైల్ ఫోన్ ని క్షుణంగా తనిఖీ చేశాడు. కాల్ డేటాలో అనుమానం కలిగించే ఎటువంటి ఆధారాలు లభించకపోయినప్పటికీ వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఒక్కసారిగా భార్యపై పోశాడు. తమ తల్లిని రక్షించుకునేందుకు ఆ ఇద్దరు కొడుకులు విఫల ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో వారికి సైతం వళ్ళు కాలిపోయింది. యాసిడ్ కారణంగా బాధితురాలి శరీరం 70 శాతం కాలిపోవడంతో హాస్పిటల్లో చికిత్సపొందుతూ మరణించింది. దీంతో నిందితుడిపై కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. పిల్లల వైద్య ఖర్చులు కూడా నిందితుడే భరించాలని పిటీషన్ వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మరణశిక్ష విధించింది.రక్త పరిహారంగా బాధితురాలి కుటుంబానికి భారీ ఎత్తున డబ్బులు చెల్లించి మరణశిక్ష నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆ దుర్మార్గుని క్షమాబిక్ష బాధిత కుటుంబ సభ్యులు ఏమాత్రం అంగీకరించలేదు. తమ కూతురిని దారుణంగా హత్య చేసినవాడికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని వారు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో త్వరలోనే నిందితుడికి మరణశిక్ష అమలుచేయనున్నట్లు న్యాయమూర్తి వారికి భరోసా ఇచ్చారు. తీర్పు వెలువడిన 15 రోజుల వ్యవధిలో నిందితుడు మరోమారు సమీక్షను కోరే అవకాశం ఉంది. ఈ భార్య బర్హాలకు ఆరుగురు సంతానం ఉన్నారని, ఇకపై వారు తల్లితండ్రులు లేని అనాధులుగా మిగలనున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి