విజయంపై వారి భరోసా అబ్బురపరుస్తోంది
- February 16, 2018
వివరాల్లోకి వెళితే ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ట్ చేసిన నందు మూవీ " ఇంతలో ఎన్నెన్ని వింతలో". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న దగ్గరనుండి మొదట చిత్ర యూనిట్ చిత్రాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే కాకుండా ఈ చిత్ర పాజిటివ్ టాక్‌తో తమిళ్ రిమేక్ రైట్స్ మంచి ఆఫర్ రావడం కూడా ఈ ప్రొడ్యూసర్స్ కి మరింత ఆనందాన్ని కలిగించింది. ఇలా చిత్రాన్ని గురించి తెలిసిన అందరూ నందుకి పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం విడుదలై ఎంత హిట్ అవుతుందో గాని ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ ఫ్రీ రిలీస్ హిట్ సంతోషంతో దర్శకుడు వరప్రసాద్ వరకూటికి.. వోల్క్స్ వాగన్ కార్‌ని విడుదలకు ముందే గిఫ్ట్ గా ఇచ్చారని వినికిడి, అంటే ప్రొడ్యూసర్‌కి సినిమా పై ఎంత నమ్మకం ఉంటే విడుదలకు ముందే డైరెక్టర్ కి కార్ గిఫ్ట్ గా ఇచ్చారో.. అని ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారి ఈ చిత్రం అందరి నోళ్ళలో నానుతుంది. ఈ చిత్రం నందుకి దర్శకుడికి పెద్ద హిట్ అయ్యి ఇద్దరికి కొత్త ఆఫర్లు రావాలని ప్రొడ్యూసర్స్ నమ్మకం నిజం కావాలని మనం కూడా కోరుకుందాం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి