ఈరోజు సాయంత్రం పూరి టీం అంతా ......?

- February 16, 2018 , by Maagulf
ఈరోజు సాయంత్రం పూరి టీం అంతా ......?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మెహబూబా. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై అంచనాలను టీజర్ బాగా పెంచేసింది. 1971లో ఇండియా-పాక్ యుద్ధ నేపథ్యంలో తలెత్తిన ప్రేమకథను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాష్‌ సరసన నేహా శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వెల్లూరులో షూటింగ్ జరుపుకోబోతోంది. శనివారం సాయంత్రం పూరి టీం అంతా వెల్లూరులో ఉండబోతోంది. ఈ మేరకు ఈ టీం వెల్లూరుకు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com