మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ 'కాయంకుళం కొచుణ్ణి' మూవీ ఫస్ట్ లుక్

- February 16, 2018 , by Maagulf
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ 'కాయంకుళం కొచుణ్ణి' మూవీ ఫస్ట్ లుక్

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా మలయాళంలో కాయంకుళం కొచుణ్ణి మూవీలో నటిస్తున్నాడు..19వ శతాబ్దంలోని హైవే మ్యాన్ కాయంకుళం కొచుణ్ణి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతున్నది. రాబిన్ వుడ్ లాగా ఉన్నవాడిని దోచుకొని లేనివాడికి ఇచ్చే కాన్సెప్ట్ చుట్టూ సినిమా ఉంటుందని సమాచారం. ఈ మూవీలోని మోహన్ లాక్ క్యారెక్టర్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. మోహన్ లాల్ ని ఈ తరహాలో ఎప్పుడు చూడలేదు అనే విధంగా ఆ ఫోటోకి కామెంట్స్ అందుతున్నాయి. చిన్న హెయిట్ స్టైల్ తో చిన్న గెడ్డంతో ఒక కన్ను మూస్తూ కనిపించడం అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.. మీరూ ఆ స్టిల్ ను చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com