భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'యశ్‌చోప్రా అవార్డ్'
- February 17, 2018
భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లే గానం ఒక శకం. జలపాత తరంగంలా ఎంతో మందిని అలరించింది ఆశా భోస్లే. దాదాపు 70 ఏళ్లుగా ఆశా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. హిందీలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఆశాకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. దాదాపు నాలుగు తరాలుగా పాడుతున్న ఆశా.. ప్లేబ్యాక్ ఇవ్వని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు . ఇటీవల ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో ఘనత సాధించిన ఆశాబోస్లే తాజాగా యశ్ చోప్రా అవార్డు అందుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం యశ్ చోప్రా పేరుతో మెమోరియల్ అవార్డు ఇస్తూ వస్తుండగా, తొలిసారి లతా మంగేష్కర్ ఈ అవార్డు అందుకుంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, షారూఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సంవత్సరం 84 ఏళ్ళ ఆశాబోస్లే ప్రముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి