షార్జాలో నేరస్తులు కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు
- February 17, 2018
షార్జా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...కుటుంబాలను కలపడం ఎంతో సంతోషం ఇస్తుందని పలువురు ఖైదీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంతో అకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత పశ్చాత్తపడి కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఉన్నా అవకాశం లేక చీకటి గదుల్లో కుమిలిపోయేవారు. ఇటువంటివారిని సానుభూతితో అర్ధం చేసుకొన్న షార్జా ప్రభుత్వం పలు నేరాలు చేసి జైలులో ఉండే ఖైదీలు వారి పిల్లలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల పిల్లలు, వారి ఆత్మీయులతో మాత్రమే మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సేవలను షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సేవల వల్ల పిల్లలు జైలు పరిసరాలను కూడా చూసే అవకాశం ఉండదని, కుటుంబ విలువలు మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. షార్జాలోని సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చెందిన 9 శాఖలలోఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. శిశు సంరక్షణ విభాగ సభ్యుడు అహ్మద్ అల్ టర్టొర్ తెలిపారు. షార్జా సిటీ, అల్ హమ్రియా, అల్ ధైడ్, అల్ బటేచ్, అల్ మదం, దిబబ్బాఅల్ హిస్న్, మలిహ, కల్బా, ఖోర్ ఫక్కాన్ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







