సందీప్ రెడ్డి-మహేష్ ల సినిమా

- February 17, 2018 , by Maagulf
సందీప్ రెడ్డి-మహేష్ ల సినిమా

వంగా సందీప్ రెడ్డి ఈ పేరు చెప్పగానే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు కూడా పొందింది.  సందీప్ రెడ్డి వంగా సెకండ్ సినిమాను చేసే ఆఫర్ ఎవరి నుంచి అందుకున్నాడో తెలుసా..! 
అర్జున్ రెడ్డి.... 2017లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వడంతో పాటు యూత్ ని ఫిదా చేసింది ఈ సినిమా. దీంతో పాటు పాత్ బ్రేకింగ్ మూవీ అంటూ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న సినిమా. 
అర్జున్ రెడ్డి సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరోగా నటించిన విజయ్ దేవరకొండ, హీరోయిన్ గా చేసిన షాలినీ పాండేకి ఆడియన్స్ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో హీరో విజయ్ దేవరకొండ వరుస ఆఫర్లు అందుకుని బిజీ అయ్యాడు. అలాగే హీరోయిన్ కూడా మంచి ఆఫర్లు అందుకుంది. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డినే ఇంకా ఏ సినిమా స్టార్ట్ చేయలేదు.
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి నెక్ట్స్ మూవీ కన్ ఫామ్ అయ్యిందట. అందులో హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. అర్జున్ రెడ్డికి ఫిదా అయిన ప్రిన్స్, సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమా ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. వంశీ పైడిపల్లితో మహేష్ చేసే సినిమా కంప్లీట్ అయ్యాకే ఇది మొదలవుతుంది. అంటే నెక్ట్స్ ఇయర్ ప్రారంభంలో సందీప్ రెడ్డి-మహేష్ ల సినిమా మొదలవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com