త్రివిక్రమ్ తో తొలిసారిగా జతకట్టనున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
- February 17, 2018
చాలా తక్కువ టైమ్ లోనే 50 సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు తమన్. వరుస సినిమాలతో హంగామా చేస్తున్న టైమ్ లో...హిట్స్ లేకపోవడంతో పాటు క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వట్లేదనే కామెంట్లతో పోటీలో వెనుకబడిపోయాడు తమన్. కొంత కాలం సైలెంట్ గా ఉన్నా... 2018లో తమన్ హంగామా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. వరుసగా సినిమాలు చేసి హిట్స్ ఇవ్వడమే కాదు, లేటెస్ట్ గా ఓ బంపర్ ఆఫర్ కూడా తమన్ చేతికి వచ్చిందట.
తమన్...టాలీవుడ్లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. ఒక దశలో దేవీశ్రీ ప్రసాద్ కి పోటీగా తమన్ వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. తక్కువ టైమ్ లోనే 50 సినిమాలు కూడా కంప్లీట్ చేసుకున్న రికార్డ్ తమన్ కి ఉంది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నాడనే విమర్శలతో పాటు, తాను సంగీతం అందించిన సినిమా ఫెయిలవ్వడంతో కొంత కాలం తమన్ హంగామాకి బ్రేక్ పడింది.
సైలెంట్ గా ఉన్న తమన్...ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ జోరు చూపిస్తున్నాడు. ఈ ఏడాది తమన్ ఇప్పటికే రెండు భారీ హిట్స్ అందుకున్నాడు. భాగమతి, తొలిప్రేమతో మళ్ళీ మునుపటి క్రేజ్ ని తెచ్చుకున్న తమన్ కి...లేటెస్ట్ గా ఓ భారీ ప్రాజెక్ట్ దక్కిందట. హారికా అండ్ హాసినీ బ్యానర్లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందే సినిమాకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ లో అనిరుథ్ ని ఫిక్స్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆ చాన్స్ తమన్ కి వచ్చిందట. చాలా రోజుల తర్వాత తమన్ కి దక్కిన పెద్ద ప్రాజెక్ట్ ఇదే అని చెప్పాలి. ఏది ఏమైనా తమన్ మళ్ళీ స్పీడ్ పెంచి ఆడియన్స్ కి మాంచి కిక్ ఇస్తున్నాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







