మహిళ పై మరో ఇరువురు మహిళలు దాడి

- February 17, 2018 , by Maagulf
మహిళ పై మరో ఇరువురు మహిళలు దాడి

కువైట్ : పాత తగాదాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక ఫిన్టాస్ అపార్ట్ మెంట్ లో శుక్రవారం ఒక మహిళను మరో ఇరువురు మహిళలు దాడి చేసి గాయపర్చారు. బాధితురాలి మాజీ భర్త తల్లి మరియు సోదరి ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలిపై భౌతిక దాడి జరిగినట్లుగా నిర్ధారిస్తూ కువైట్ జాతీయ పోలీసులకు వైద్య నివేదిక ఇచ్చింది. ఆమె తలుపు తీర్చి వారికి సమాధానం చెప్పేలోపున ఆ ఇద్దరు మహిళలను తనను ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లు బాధితురాలు పోలీసులకు ఆరోపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com