మియా మల్కోవా నగ్న ఫోటోలను తీసింది అక్కడే - ఆర్.జి.వి
- February 17, 2018
వివాదాస్పద గాడ్ సెక్స్ ట్రూత్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన వర్మను సీసీఎస్ పోలీసులు మూడు గంటలపాటు విచారించారు. వర్మ సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపినట్లు తెలిసింది. జీఎస్టీ మూవీ కథ మాత్రమే తనది అని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఇలాంటివి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
జీఎస్టీ మూవీని అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిందని అన్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారని తెలిసింది. వర్మ పోలండ్, యూకే వెళ్లడంపై విచారణ చేస్తున్నామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ అన్నారు. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగామని, అతని ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేశామన్నారు.
వర్మపై నమోదైన కేసు ప్రకారమే విచారణ జరిపామని, టెక్నికల్, లీగల్ అంశాలపై వర్మని ప్రశ్నించామన్నారు పోలీసులు. జీఎస్టీని పోలాండ్, యూకేలో తీశామని వర్మ చెప్పారన్నారు. వెబ్‌లో విడుదల చేసిన మియా మల్కోవా నగ్న ఫోటోలను ఎక్కడ తీశారన్న విషయాలపైనా పోలీసులు ఆరా తీశారు. ఆ ఫోటోలను, సినిమా వీడీయోకి సంబంధించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కి పోలీసులు పంపించారు. రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు ఉండనున్నాయి.
భారతీయ చట్టాలను ఉల్లంఘించలేదన్నారు రాంగోపాల్ వర్మ. సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చినందుకు తనకు ఎలాంటి డబ్బు ముట్టలేదన్నారు. ఒకవేళ డబ్బు ముట్టినట్లు రుజువులుంటే నిరూపించాలని పోలీసులకే సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు వర్మ పాస్‌పోర్ట్ వెరిఫై చేస్తామని, అతను నిజంగానే ఇతర దేశాలకి వెళ్లి జీఎస్టీని తీశాడా లేదా ఇక్కడే ఉండి తీశాడా అన్నది విచారిస్తామన్నారు. మిగతా టెక్నికల్ ఆధారాలకి సంబంధించి మూడు రోజుల సమయం కావాలని వర్మ కోరారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి