భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్కు.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ!
- February 18, 2018
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్కు రానున్నారు. నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ), నాస్కామ్ ఇండియా లీడర్షిప్(ఎన్ఐఎల్ఎఫ్) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా పూర్తయినట్లు మంత్రి తెలిపారు.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని అటు ఏపీ, ఇటు తెలంగాణ నేతలు, ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్న సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తుండడం సంచలనంగా మారింది. 'ప్రధాని మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు. ప్రధాని స్థాయిలో ప్రారంభించగల కార్యక్రమాలు ఏవైనా ఉంటే సమాచారం ఇవ్వండి' అని ఏపీ ప్రభుత్వానికి పీఎంవో నుంచి సమాచారం వచ్చి రెండు రోజులు కూడా కాకముందే ఉమ్మడి రాజధానికి మోదీ వస్తుండడంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఏమైనా హమీలు ఇస్తారా? లేదా?..
హైదరాబాద్కు వస్తున్న మోదీ అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలుస్తారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..