ఈనెల 21న మధురై లో పార్టీ పేరు ప్రకటించనున్న కమల్ హాసన్

- February 18, 2018 , by Maagulf
ఈనెల 21న మధురై లో పార్టీ పేరు ప్రకటించనున్న కమల్ హాసన్

ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే ఇండియన్ హీరో చేయలేదు. అలాంటి కమల్ హాసన్ లేటెస్ట్ గా ఓ సెన్షేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఎంటైర్ సౌత్ షాక్ అయింది. ప్రతి సినిమా లవర్ కమల్ నిర్ణయానికి షాక్ అవుతున్నారు. తానిక రెండు సినిమాలు మాత్రమే చేస్తాడనే మాట చాలామంది ఫిల్మ్ లవర్స్ ను విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఇదేమీ రూమర్ కాదు. ఆయనే స్వయంగా చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన చేస్తానంటోంది సామాజికసేవ కాబట్టి ఎవరూ మాట్లాడ్డం లేదు. పైగా తన బలం ఫ్యాన్సే అంటున్నాడు. యాభైయేళ్లకు పైగా నటుడుగా ఉన్న కమల్ మూడున్నర దశాబ్ధాలకు పైగా సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తనకంటూ పదిలక్షలమంది సైన్యం సమకూర్చుకున్నాడట. ఇప్పుడు తను పెట్టబోయే పార్టీకి తొలి ఓటర్స్ వీరే. అయితే కమల్ తన పార్టీ పేరుని సిద్ధాంతాలను అధికారికంగా ఈనెల 21న మధురై లో ప్రకటించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com