జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ సదస్సుకు మినిస్టర్ కేటీఆర్‌కు ఆహ్వానం
- February 18, 2018
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి అరుదైన గౌరవం లభించింది. జర్మనీలో జరిగే జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. జర్మనీలోని హంబర్గ్‌లో మార్చి 2న జరిగే సమావేశంలో తెలంగాణ అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కేటీఆర్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలను తెలుసుకోవాలని జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తిగా ఉందని ఆహ్వానంలో పేర్కొన్నారు. తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై జర్మన్ సంస్థ ప్రత్యేకంగా ఆసక్తి వ్యక్తం చేయడం, సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







