హత్య కేసులో వ్యక్తి ఒమన్‌లో అరెస్ట్
- February 19, 2018
సహచరుడి హత్య కేసులో ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని అల్ హయిల్‌లోని వాడిలో పోలీసులు కనుగొన్నారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఉంది ఈ ప్రాంతం. హత్య కేసు ఛేదించే క్రమంలో నిందితుడి కోసం వెతుకుతున్న పోలీసులకు లభించిన ఆధారాలతో, నిందితుడి సహచరుడ్ని గుర్తించారు. అరెస్టయిన వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడ్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మస్కట్ పోలీస్ కమాండ్ - డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ అలాగే ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అల్ కౌద్ పోలీస్ స్టేషన్, క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్‌మెంట్, సంయుక్తంగా ఆసియా జాతీయుడి మృతి కేసుని డీల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







