ప్రముఖ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, ఊహ చిన్న కొడుకు సినీ ప్రవేశం

- February 19, 2018 , by Maagulf
ప్రముఖ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, ఊహ చిన్న కొడుకు సినీ ప్రవేశం

ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ చిన్న కుమారుడు రోహన్ సైతం వెండితెరపైకి వచ్చేస్తున్నాడు. ఏకంగా త్రిభాషా చిత్రంతో మాస్టర్ రోహన్ సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

ప్రముఖ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, ఊహ దంపతులు ఏ ముహూర్తాన ప్రేమ వివాహం చేసుకున్నారో కానీ వారి పిల్లలు సైతం నటనకే అంకితమైపోతున్నారు. శ్రీకాంత్ కుమార్తె మేధ, కుమారుడు రోషన్ బాలనటులుగా 'రుద్రమదేవి' చిత్రంలో నటించారు. ఇక రోషన్ అయితే ఓ అడుగు ముందుకేసి 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఏకంగా హీరోగానూ నటించి మెప్పించాడు. ఇప్పుడు శ్రీకాంత్, ఊహ చిన్న కొడుకు రోహన్ సైతం వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తున్న ఓ త్రిభాషా చిత్రంలో శ్రీకాంత్ చిన్నకుమారుడు రోహన్ నటిస్తున్నాడు. ప్రభుదేవా, రోహన్ తండ్రీకొడుకులుగా నటించే ఈ సినిమా హిట్ స్టేషన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. ఇటీవలే ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేషన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని తెలిపే ఈ ఫ్యామిలీ డ్రామాలో కాస్తంత హారర్ ఎలిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది.

విశేషం ఏమంటే శ్రీకాంత్ నటించిన తొలి హారర్ ఫిల్మ్ 'రా.. రా' ఈ నెల 23న విడుదల కాబోతోంది. మరి శ్రీకాంత్‌కు ఎలాంటి పుత్రోత్సాహాన్ని చిన్న కుమారుడు అందిస్తాడో చూడాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com