ప్రెస్‌రివ్యూ: 'జగన్ అవిశ్వాసం పెడితే మద్దతిస్తా' అన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

- February 19, 2018 , by Maagulf
ప్రెస్‌రివ్యూ: 'జగన్ అవిశ్వాసం పెడితే  మద్దతిస్తా' అన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, అవిశ్వాసం పెడితే తాను ఇతర పార్టీల మద్దతు కూడగడతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారని ఈనాడు పేర్కొంది.

సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ సవాలును ఉద్దేశించి పవన్‌ మాట్లాడుతూ.. '' ప్రకాశం జిల్లాలో వైకాపా అధినేత సవాల్‌ విసిరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాను.. మద్దతు ఇవ్వాలని ఛాలెంజ్‌ విసిరారు. ఆ సవాల్‌కు స్పందిద్దామని ప్రెస్‌మీట్‌ పెట్టాను.

ఆయనకు చెప్పదలచుకున్నదేమిటంటే.. అన్నింటికీ సిద్ధపడే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మద్దతు లేదని జగన్‌ అన్నారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను.

దానికన్నా ముందు మీరు నాకు చేయాల్సింది ఒక్కటే. నిబంధనల ప్రకారం ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. ముందు ఆ పని మీరు చేయండి. ఇప్పుడు ఇంకా పార్లమెంట్‌ సభా వ్యవహారాలు నడవడంలేదు గానీ, పార్లమెంట్‌ సెక్రటరీ జనరల్‌ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నానని మీ ఎంపీలను రేపే పంపండి.

4న నేను వస్తాను. సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌, తెదేపా, ఎవరైతే మనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో, వారందరి మద్దతు నేను సంపాదిస్తా. మీరు ఆలోచించుకుని మార్చి 4న తీర్మానం పెట్టండి. 5న అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో చర్చకు రావాలి.

స్పీకర్‌ అడిగినప్పుడు 50 మంది లేచి నిలబడాలి. ఇప్పటికే తెదేపా, వైకాపా పార్టీలు సిద్ధమని ప్రకటించాయి. రెండు పార్టీలు కలిస్తే 25 మంది ఎంపీలు ఉన్నారు. ముందు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి. మేం మద్దతు సంపాదిస్తాం. ఏపీ విభజన హామీలపై మాట్లాడండి. ఎవరెవరు మద్దతు తెలిపారో అందరూ కలిసి వస్తారని పవన్ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది.

"పీఎన్‌బీ కుంభకోణం మోదీ పాలనలో మొదటిదేమీ కాదు!"

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com