తమిళ హీరో ఆర్యని పెళ్లి చేసుకుందుకు 70 వేల మంది అమ్మాయిలు క్యూ.. త్వరలో స్యయంవరం!

- February 19, 2018 , by Maagulf
తమిళ హీరో ఆర్యని పెళ్లి చేసుకుందుకు 70 వేల మంది అమ్మాయిలు క్యూ.. త్వరలో స్యయంవరం!

Arya to host sensational reality show. It will starts from April ఆర్య తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే తమిళ బుల్లితెర పై రియాలిటీ షోలో మెరిసేందుకు అంగీకరించాడు. కాగా ఈ రియాలిటీ షో అలాంటి ఇలాంటి రియాలిటీ షో కాదు. ఇందులో ఆర్య వరుడు గా కనిపిస్తాడు. ఈ షోలో పాల్గొనే యువతులంతా వధువులు అన్న మాట.
తమిళ హీరో ఆర్య సరికొత్త గేమ్ షోకు తెర తీయబోతున్నాడు. ఆర్య తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే తమిళ బుల్లితెర పై రియాలిటీ షోలో మెరిసేందుకు అంగీకరించాడు. కాగా ఈ రియాలిటీ షో అలాంటి ఇలాంటి రియాలిటీ షో కాదు. ఇందులో ఆర్య వరుడు గా కనిపిస్తాడు. ఈ షోలో పాల్గొనే యువతులంతా వధువులు అన్న మాట. ఇప్పటికే ఈ రియాలిటీ షోలో పాల్గొనడానికి 70 వేల మంది యువతులు దరఖాస్తు చేసుకున్నారంటే క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ షో ని సదరు ఛానల్ ఏప్రిల్ నుంచి ప్రారంభించబోతోంది.సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో
ఇప్పటి వరకు బుల్లి తెరపై పలు రియాలిటీ షోలు వచ్చాయి. కానీ ఈ షోకి పార్రంభం కాక ముందే రెస్పాన్స్ అదిరిపోయింది. ఏకంగా 70 వేల మంది యువతులు అప్లై చేసుకోవడంతో సదరు ఛానల్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది.ఆర్యకు అమ్మాయిల్లో క్రేజ్
ఒడ్డు పొడుగు.. ఆకర్షించే ఆహార్యం ఆర్య సొంతం. ఆర్యకు యువతుల్లో మంచి క్రేజ్ ఉంది. చాల మంది యువతులకు ఆర్య కలల రాకుమారుడు కూడా. అలాంటి హీరోకు బుల్లి తెరపై వధువుగా కనిపించే అవకాశం వస్తే అమ్మాయిలు గమ్మున ఉంటారా !స్వయంవరం తరహాలో
ఈ గేమ్ షో స్వయంవరం తరహాలో ఉంటుందట. పురాణాల్లో సీత, ద్రౌపతి వంటి వారిని సొంత చేసుకునేందుకు స్యయంవరం నిర్వహించినట్లు ఉంది. కానీ ఈ గేమ్ షోలో స్యయంవరం మాత్రం యువతులకు. వారిలో విజేత గా నిలిచిన వారు ఆర్యకు వధువు అవుతారు.కేవలం 18 మందికి మాత్రమే ఛాన్స్
దాదాపు 70 వేల అప్లికేషన్లు సదరు ఛానల్ కు అందాయి. వాటిని జల్లెడ పట్టి కేవలం 18 మందికి మాత్రమే షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తారట.బుల్లి తెరపై హీరోల హవా
ఇటీవల కాలంలో బుల్లి తెరని కూడా స్టార్ హీరోలు ఆక్రమించేస్తునారు. బుల్లి తెరపై అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో సంచలనాలు కొనసాగుతున్నాయి. పలువురు హీరోలు ఈ షోకి హోస్ట్ లు గా మారిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ నుంచి ప్రారంభం
ఆర్య పాల్గొనబోతున్న ఈ రియాలిటీ షో పేరు 'ఇంగవీటు మాపిళ్ళై'. ఈ షోని ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నట్లు సదరు ఛానల్ ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com