సమంత 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది.

- February 19, 2018 , by Maagulf
సమంత 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది.

సమంత కమర్షియల్ సినిమాలతోనే తనదైన ముద్ర వేసింది. నటిగా తనేంటో రుజువు చేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మాత్రం చేయలేదు. కన్నడలో రెండేళ్ల కిందట వచ్చిన 'యు టర్న్' సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన సామ్.. ఆ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది సామ్.

ఎట్టకేలకు 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ మొదలవడం విశేషం. శనివారమే చిత్రీకరణ ఆరంభించారు. సమంత రాజమండ్రికి వచ్చిన విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తన కోసం ఫ్యాన్స్ తహతహలాడిపోతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'యు టర్న్' చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది సామ్. కన్నడలో 'యు టర్న్' తీసిన పవన్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీస్తన్నారు.

సమంత ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతోంది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న సినిమా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com