భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ దూరం, క్రికెట్ అభిమానులకు చేదువార్త!
- February 19, 2018
టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదువార్త ఎదురవబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లను వన్డే సిరీస్ లో ఓడించి t20 సిరీస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది టీమిండియా. ఆదివారం జరిగిన మొదటి t20 లో భారత్ శుభారంభాన్నిచ్చింది. ఆ మ్యాచ్ లో భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో బుధవారం జరిగే రెండవ t20 కి కోహ్లీ ఆడటం అనుమానమేనన్న భావన వ్యక్తం చేస్తున్నారు జట్టు ఆటగాళ్లు. ఈ క్రమంలో వచ్చే రెండు నెలల్లో కీలక సిరీస్ ను ఎదుర్కోవాలి కనుక ప్రస్తుతం కోహ్లీకి సాధ్యమయినంత ఫిట్నెస్ అవసరం. గాయపడ్డ కోహ్లీ బుధవారం మ్యాచ్ ఆడితే గాయం మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. దాంతో వచ్చే సిరీస్ లో పాల్గొనటం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ రెండవ t20 కి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఒకవేళ కోహ్లీ మ్యాచ్ కు దూరంగా ఉన్నట్టయితే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశముంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







