సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో .. 94 మంది మృతి
- February 19, 2018
డమస్కస్: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో 94 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. డమస్కస్కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సిరియా ప్రభుత్వ దళాలు ఈ దాడులు చేసినట్లు తెలుస్తున్నది. సిరియా ఆర్మీ కూడా ఉగ్ర స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 2013 నుంచి ఈస్ట్రన్ గౌటా మిలిటెంట్ల ఆధీనంలో ఉన్నది. అక్కడ సుమారు 4 లక్షల మంది జీవిస్తున్నారు. డమస్కస్ సమీపంలో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ఏకైక ప్రాంతం అది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







