సింగపూర్ ఉద్యోగులకు అసలైన పండగ.. బోనస్ రూ.14 వేలు
- February 19, 2018
సింగపూర్ ప్రజలకు అసలైన పండగ ఇప్పడే వచ్చింది. 2017 సం. బడ్జెట్లో 10 బిలియన్ డాలర్లు మిగిలిపోయిందని దాన్ని పౌరులందరికీ పంచేస్తోంది సింగపూర్ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని బోనస్ రూపంలో ఇస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కీట్ వెల్లడించారు. 760 కోట్ల డాలర్ల మిగులు బడ్జెట్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి పార్లమెంట్లో 2018 బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సింగపూర్ అభివృద్ధి ఫలాలను అందరికీ పంచిపెట్టాలన్నలక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆ ఉద్దేశ్యంతోనే ఈ బోనస్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం రూ.2600 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ బోనస్‌ను 27 లక్షలమందికి అందజేయనున్నట్లు తెలిపింది. వారి ఆదాయాన్ని బట్టి ఎంత బోనస్ ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. మిగులు బడ్జెట్‌తో ఇంకో మంచి పని కూడా చేస్తోంది. దేశంలోని రైల్వే అభివృద్ధి కోసం 500 కోట్ల డాలర్లను కేటాయించారు.
28 వేల డాలర్ల వేతనం ఉన్న వారికి 300 డాలర్లు ( మన కరెన్సీ ప్రకారం రూ.14,700లు)
28 వేల డాలర్లకు పైగా ఉంటే 200 డాలర్లు (రూ.9,800లు)
లక్షడాలర్లకంటే ఎక్కువ వుంటే 100 డాలర్లు (రూ.4,900లు) బోనస్ లభిస్తుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







