మల్టీస్టారర్‌లో నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్
- February 20, 2018
నందమూరి మల్టీస్టారర్ సినిమా కోసం నందమూరి అభిమానులు, టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు, టోటల్ టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నందమూరి మల్టీస్టారర్ కాకపోయినా ఒకే సినిమాలో నందమూరి హీరోలను స్క్రీన్ మీద చూసే అదృష్టం ఇప్పుడు టాలీవుడ్ సినీ జనాలకు కలగబోతోంది. ప్రస్తుతం 'ఎం.ఎల్.ఏ, నా నువ్వే' వంటి సినిమాల్లో నటిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాను పవన్ సాధినేని దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఇజం సినిమా తర్వాత జై లవకుశ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ ఇప్పుడు వరుసగా తన సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాల తర్వాత వెంటనే పవన్ సాధినేని సినిమాకు కమిట్ అయ్యాడు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ, సోదరుడు ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఈ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కళ్యాణ్‌రామ్ సినిమాలో ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ నటిస్తే సినిమాకు ఎలాంటి హైప్ వస్తుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలకు ఒకేసారి ఈ తండ్రి కొడుకులను స్క్రీన్ మీద చూసేందుకు రెండు కళ్లు చాలవేమో..!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







