హైదరాబాద్‌కు అడోబ్‌ సంస్థ

- February 20, 2018 , by Maagulf
హైదరాబాద్‌కు అడోబ్‌ సంస్థ

హైదరాబాద్ లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' (ఏఐ) కేంద్రాన్ని అడోబ్‌ సంస్థ  హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. నగరంలో  జరుగుతున్న  ప్రపంచ ఐటీ కాంగ్రెస్ లో  భాగంగా అడోబ్‌ చైర్మెన్‌, సీఈవో శంతనూ నారాయణ్‌తో  ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు. ఈ   సమవేశంలో  అడోబ్‌ కేంద్రాన్ని హైదరబాద్ లో  నెలకొల్పాలని కేటీఆర్‌ శంతనూ నారాయణ్‌ ను కోరారు .  ఈ ప్రతిపాదనకు  శంతనూ  అంగీకారం తెలిపారు.అడోబ్‌ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com