'ప్రెసిడెంట్స్‌ డే'ను జరుపుకుంటున్న అమెరికా

- February 20, 2018 , by Maagulf
'ప్రెసిడెంట్స్‌ డే'ను జరుపుకుంటున్న అమెరికా

వాషింగ్టన్‌ : 'ప్రెసిడెంట్స్‌ డే' ను అమెరికా మంగళవారం జరుపుకుంటోంది. అమెరికా ప్రధమ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ (1732-1799) జన్మదినమైన ఈరోజున ప్రభుత్వ సంస్థలకు, స్కూళ్ళకు, బ్యాంకులకు అన్నిటికీ శలవు. అయితే తప్పనిసరిగా పాటించాలనేమీ లేదు. వాస్తవానికి వాషింగ్టన్‌ జన్మించింది ఫిబ్రవరి 22, మరణించింది కూడా 22నే. దాంతో దేశవ్యాప్తంగా ఈ రోజును ప్రెసిడెంట్స్‌ డే గా పాటించాలని నిర్ణయించారు. 1960వ దశకంలో యూనిఫారం మండే హాలిడే యాక్ట్‌ను కాంగ్రెస్‌ ఆమోదించింది. అంటే అన్ని ప్రభుత్వ శలవు దినాలు సోమవారమే వుండాలని నిర్ణయించారు. ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజులు శలవు దినాలు కలిసి వచ్చాయని భావించి దాన్ని అమలు చేసారు. దేశానికి ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షులందరినీ స్మరించుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com