షార్జాలో మరో అద్భుత నిర్మాణం ‘సన్ ఐలాండ్’
- February 20, 2018
షార్జా: గతంలో ఖర్జురం చెట్టు ఆకారంలో సముద్రంలో ఐలాండ్‌ను నిర్మించిన షార్జా.. ఇప్పుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ‘సన్ ఐలాండ్’ పేరుతో సముద్ర భాగంలో చిన్నచిన్న ఎనిమిది ద్వీపాలను కలుపుతూ ఏకంగా నగరాన్నే నిర్మించ తలపెట్టింది. మొదటి విడతలో ఖరీదైన 231 విల్లాలతో నిర్మిస్తున్న ఈ వాటర్ ఫ్రంట్ సిటీకి సన్ ఐలాండ్ గా నామకరణం చేసింది. తాజాగా ఈ సన్ ఐలాండ్ నమునా చిత్రాన్ని విడుదల చేశారు దీని డెవలపర్లు. మొదటి దశలో ఖరీదైన 231 విల్లాలో కొన్ని మూడు, నాలుగు బెడ్రూంలతో, మరికొన్ని ఐదు, ఆరు బెడ్రూంలతో నిర్మించనున్నారు.
2019 చివరి నాటికి ఈ వాటర్ ఫ్రంట్ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే కెంపిన్స్కీ, డ్యూసిట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో ఆపరేటర్లుగా చేసేందుకు సంతకాలు చేశాయి. విల్లాల్లో వాణిజ్య యూనిట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్కు, హోటళ్ళు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును నిర్మించే ప్రదేశం హమ్రియయా జోన్ కిందికి వస్తుంది. 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందట. ఈ వాటర్ ఫ్రంట్ సిటీ ద్వారా ప్రక్కనే ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ఎమిరేట్స్ వాసులకు వినోదం, విశ్రాంతికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఎమిరేట్స్‌ను ఆకర్షించే నీటి టాక్సీలను అందించే దుబాయ్ ఆర్టీఏతో డెవలపర్లు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని తెలితసింది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







