షారుక్ అంటే ఇష్టం.. రోబో ‘సోఫియా’ సమాధానాలకు టెక్ దిగ్గజాల ఆశ్చర్యం
- February 20, 2018
షారూక్ ఇష్టం
హాంగ్కాంగ్ చాలా ఇష్టం
మానవాళిపై ఆధిపత్యం చేయాలన్న ఆలోచన లేదు
సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారిత కోసం వినియోగిస్తా
వరల్డ్ ఐటీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రోబో సోఫియా
ప్రపంచ ఐటీ సదస్సులో రెండో రోజు (మంగ ళవారంనాడు) నూతన సాంకేతికతలు, కృతిమ మేధస్సు అంశాలపై చర్చలు కొనసాగాయి. ఈ సంద ర్భంగా రోబో సోఫియా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రోబో సోఫియాను దాని సృష్టికర్త, డేవిడ్ హాన్సన్ను ఇంటర్వ్యూ చేశారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగా చిట్టిచిట్టి మాటలతో సోషియా ప్రసంగం అందరినీ అకట్టు కుంది. రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని సోఫియా చెప్పింది.
సౌదీ పౌరసత్వాన్ని మహి ళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. అందరికీ విశ్రాంతి అవసరమని చెప్పింది. తనతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదని తెలిపింది. తాను ఇంకా చిన్నదాణ్ణే, బ్యాంకు ఖాతా లేదు. బిట్ కాయిన్లు కొనుగోలు చేయలేదని వెల్లడించింది. తానెప్పుడూ మనస్తాపానికి గురికా లేదని చెప్పింది.
మానవాళిపై అధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తనకు లేదని, మానవాళితో కలిసి మెలిసి సఖ్యతతో ఉండాలన్నదే తన అభిప్రాయమన్నది. మానవులు సృజనాత్మక కలిగిన వారని తెలిపింది. మానవజాతి, రోబోలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సోఫియా స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన నటుడు షారూక్ ఖాన్ అని చెప్పింది. తాను తిరిగిన చాలా ప్లేస్ల్లో హాంగ్కాంగ్ చాలా ఇష్టమని తెలిపింది. ప్రపంచంలో అందరూ ప్రేమగా ఉండాలన్నదే నా ఇంటెన్షన్, అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా స్పష్టం చేసింది. థాంక్యూకి మించిన గొప్ప పదం లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..