బ్రిటన్లో ప్రవాస భారతీయుల నిరసనలు
- February 20, 2018
- ఇమ్మిగ్రేషన్ విధానంలో సవరణలు చేపట్టొదని ఆందోళనకారుల డిమాండ్
లండన్ : బ్రిటన్‌లో ప్రవాస భారతీయులు నిరసన చేపట్టారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తున్నది. అమెరికా మాదిరిగా వలసదారులపై ఆంక్షలు మోపేందుకు సన్నద్ధమవుతున్నది. ప్రధాని థెరిసా మే ప్రతిపాదించిన చట్ట సవరణలను ప్రవాస భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసినట్టయితే తాము తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. బ్రిటన్ ప్రధాని తన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. పార్లమెంట్ వెలువల బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర దేశాలకు చెందినవారిని కూడా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఈ అత్యున్నత నైపుణ్యమున్న వలస జాతీయుల (హైలీ స్కిల్డ్ మైగ్రాంట్స్-హెచ్‌ఎస్‌ఎం) బృందంలో సుమారు వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వారిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెలుపల ఉండే దేశాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, టీచర్లు ఉన్నారు. నిరసన కార్యక్రమంలో దక్షిణ ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన నిపుణులను కూడా హెచ్‌ఎస్‌ఎం కలుపుకుపోతోంది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాలకు చెందిన వారు పాల్గొంటారని ప్రవాస భారతీయుల యూనియన్ సభ్యులు తెలిపారు.
బ్రిటన్‌లో శాశ్వత నివాసం (ఇన్‌డెఫినైట్ లీవ్ టు రిమైన్-ఐఎల్‌ఆర్) కోసం పెట్టుకున్న దరఖాస్తుల విషయంలో జాప్యాలతో పాటు వాటిని తిరస్కరించడానికి వ్యతిరేకంగా వృత్తి నిపుణులు, వారి కుటుంబాలు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. గతనెల డౌనింగ్ స్ట్రీట్ ( ప్రధాని అధికారిక నివాసం) వెలుపల నిరసన చేపట్టిన ఈ గ్రూపు నిర్వాహకుల్లో ఒకరైన అదితి భరద్వాజ్ మాట్లాడుతూ, సహేతుకమైన కారణాలు చూపకుండా యూకేలో ఉంటూ పనిచేసుకునే హక్కును ప్రభుత్వం తిరస్కరిస్తున్నందు వల్ల తమ ర్యాలీకి మరింత మంది మద్దతు తెలుపుతున్నారని ఆమె చెప్పారు. కొన్నేండ్ల కిందట టైర్-1 (జనరల్) వీసా కింద యూకేలో అడుగుపెట్టిన వృత్తి నిపుణులు ఆ దేశంలో ఐదేండ్ల పాటు చట్టబద్ధంగా నివసిస్తే శాశ్వత నివాస హోదా పొందడానికి వారు అరుÛలు.
అయితే నేరస్థులు, పన్ను ఎగవేతదారులకు ఉద్దేశించిన యూకే వలస చట్టంలోని ఓ సెక్షన్ కింద తమ దరఖాస్తుల పరిశీలన, ఆమోదాల విషయంలో అధికారులు జాప్యం చేయడం లేదా తిరస్కరించడం లాంటివి చేస్తున్నారని హెచ్‌ఎస్‌ఎం ఆరోపిస్తోంది. కాగా, యూకే 6 ద్వారా తమ దరఖాస్తులను ఆరు నెలల్లోగా పరిశీలించి పరిష్కరించాలని థెరిసా మే, హోం శాఖ మంత్రి అంబర్ రూద్, విపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌లను అదితి ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేశారు. దీంతో సాధ్యమైనంత త్వరలోనే అన్ని వీసా దరఖాస్తుల సమస్యలను పరిష్కరిస్తామని యూకే హోం శాఖ కార్యాలయం హామీ ఇవ్వడం గమనార్హ.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







