తెలంగాణ జాగృతి సహాయంతో స్వదేశానికి చేరిన కువైట్ బాధితుల తొలి బృందం
- February 20, 2018
హైదరాబాద్: ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన చార్జీలతో కువైట్ నుండి బయలుదేరిన మొదటి బృందం మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ చేరుకున్నారు. కువైట్ నుండి వచ్చిన 9 మందికి శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి యువత అధ్యక్షులు కొరబోయిన విజయ్ ఇతర జాగృతి నాయకులు స్వాగతం పలికారు. కువైట్ నుండి వచ్చిన వారు తమ చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. తమను స్వదేశానికి రావడానికి సహకరించిన ఎంపీ కవితకు బాధితులు కృతఙ్ఞతలు తెలిపారు. బాధితులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ జాగృతి ఏర్పాట్లు చేసింది. స్వదేశానికి చేరుకున్న వారి వివరాలు.. 1) అంగోత్ ప్రకాష్ - సంపల్లి తాండా, డిచ్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా 2) గుగులోత్ దేవీదాస్ - సంపల్లి, డిచ్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా 3) మలావాత్ రవి కుమార్ - జక్రాన్ పల్లి తాండ, నిజామాబాద్ జిల్లా 4) మెగావత్ జెత్యా - సీతాయిపేట్ తాండా, ధర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా 5) పుల్లా రంజీత్ - హొన్నాజిపేట్, ధర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా 6) అజ్మీరా శ్రీనివాస్ - కొండాపూర్, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా 7) శాగ మహిపాల్ - గిద్ద, రామారెడ్డీ మండలం, కామారెడ్డి జిల్లా.
8 ) గొల్ల అనుకుమార్ - తొర్లికొండ, (ఆర్మూర్ దగ్గర), నిజామాబాద్ జిల్లా 9) అంతిరెడ్డి రాజు - సంపల్లి, డిచ్ పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







