సిరియాలో చిన్నారుల మృతి పట్ల ఐక్యరాజ్య సమితి కన్నెర్ర చేసింది
- February 20, 2018
న్యూయార్క్‌్: సిరియాలో చిన్నారుల మృతి పట్ల ఐక్యరాజ్య సమితి కన్నెర్ర చేసింది. గౌటా నగరంలో సిరియా సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య ఐదు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో మంగళవారం నాటికి 127 మంది మృతి చెందారు. వీరిలో 39 మంది చిన్నారులు ఉన్నారు. 'సిరియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుము కున్నాయి. సైన్యం, తిరుగు బాటు దారులకు మధ్య జరుగు తున్న పోరులో అభం శుభం తెలియని చిన్నారులు చని పోయారు. పిల్లల మృతితో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. సిరియాలో శాంతిస్థాపన కోసం ప్రతీ ఒక్కదేశం కృషి చేయాలి' అని యూనిసెఫ్ రీజియన్ డైరెక్టర్ గీర్త్ కెప్లేర్ అన్నారు. ఈ ఘటనపై బ్లాంక్ స్టేట్‌మెంట్ విడుదల చేస్తు న్నామని అన్నారు. సిరియాలో చిన్నారుల పరిస్థితి దుర్భ రంగా మారిందన్నారు. కాగా, సిరియాలోని గౌటా నగరం 2012 నుంచి తిరుగుబాటుదారుల ఆధీ నంలో ఉంది. ఈనగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకో వాలని సిరియా అధ్యక్షుడు అస్సద్ భావిస్తున్నారు. ఈనే పథ్యంలో గౌటాలో తలదాచుకున్న తిరుగుబాటు దారులను తరిమివేసేందుకు సిరియా సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..