ఐఫోన్లకు ఊరట, తెలుగు అక్షరం రహస్యాన్ని చేధించిన ఆపిల్,ఆపిల్ న్యూ ఓ ఎస్
- February 20, 2018
గత కొద్ది రోజుల నుంచి ఐఫోన్లతో పాటు ఫేస్‌బుక్‌ని సైతం ముప్పతిప్పలు పెట్టిన తెలుగు అక్షరం 'జ్ఞా' బగ్ ను ఆపిల్ కంపెనీ ఎట్టకేలకు చేధించింది. ఐఓఎస్ 11.2.5 ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు అక్షరం 'జ్ఞా' వల్ల ఆ ఓఎస్‌లోని యాప్స్ క్రాష్ అవడంతోపాటు కొన్ని సందర్భాల్లో ఐఓఎస్ డివైస్‌లు పనిచేయకుండా పోతున్నాయనే వార్త వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్తపై స్పందించిన ఆపిల్ వెంటనే ఫిక్స్‌ను రిలీజ్ చేస్తామని అప్పుడు ప్రకటించింది కూడా. ఈ క్రమంలోనే తాజాగా ఆపిల్ సంస్థ సదరు బగ్(సాఫ్ట్వేర్ లోపం)కు గాను ఫిక్స్‌ను విడుదల చేసింది. ఐఓఎస్ 11.2.6 అప్డేట్ ఇప్పుడు ఐఓఎస్ డివైస్‌లకు లభిస్తున్నది. యూజర్లు తమ డివైస్‌లలో ఓఎస్‌ను ఈ కొత్త వెర్షన్‌కు అప్డేట్ చేసుకుంటే సదరు జ్ఞా అక్షరం బగ్ నుంచి తప్పించుకోవచ్చని ఆపిల్ వెల్లడించింది. ఐఓఎస్ 11.2.6 మాత్రమే కాకుండా మాక్ ఓఎస్ 10.13.3, వాచ్ ఓఎస్ 4.2.3 అప్డేట్లను కూడా ఆపిల్ విడుదల చేసింది. ఆయా డివైస్‌లలో ఓఎస్‌లను కొత్త వెర్షన్లకు అప్డేట్ చేస్తే సదరు బగ్ నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి