ఒమన్‌ బస్సు ప్రమాదం: చిన్నారి మృతి, 24 మందికి గాయాలు

- February 20, 2018 , by Maagulf
ఒమన్‌ బస్సు ప్రమాదం: చిన్నారి మృతి, 24 మందికి గాయాలు

మస్కట్‌: పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు ఒకటి ప్రమాదానికి గురి కావడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 24 మంది గాయాల పాలయ్యారు. కిండర్‌గార్టెన్‌ పిల్లల్ని తీసుకెళుతున్న బస్సు, మరో బస్సుని ఇబ్రి ప్రాంతంలో ఢీ కొంది. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందింది, మరో 24 మందికి గాయాలయ్యాయని రాయల్‌ ఒమన్‌ పోలీసులు ధృవీకరించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, సహాయక బృందాల్ని సకాలంలో అక్కడికి పంపించి, ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com