ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 22 వరకు కొత్త క్షమాబిక్ష కాలం పొడగించిన కువైట్

- February 20, 2018 , by Maagulf
ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 22 వరకు కొత్త క్షమాబిక్ష కాలం పొడగించిన కువైట్

కువైట్: వీసా గడువు ముగిసినా కువైట్ దేశం నుంచి కదలని  విదేశీయులకు ఎటువంటి ఆక్షేపణలు లేకుండా వారి వారి దేశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) కాలాన్ని కువైత్‌ ప్రభుత్వం రెండు నెలలు పాటు పొడిగించింది. మాములుగా ఈ నెల 22 వ తేదీ (గురువారం) గడువు ముగియనుంది. కానీ.. ఆ దేశ ఉపప్రధాని షేక్‌ ఖాలీద్‌ జర్రా అల్‌ సబ మంగళవారం చేసిన ఒక  ప్రకటనతో వీసాలను క్రమబద్ధీకరణ  చేసుకునేందుకు ఏప్రిల్‌ 22 వరకు అవకాశం కల్పించారు. కువైట్ దేశంలో క్షమాభిక్ష పథకానికి ఇప్పటి వరకు సుమారు 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 4,000 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని సమాచారం .అక్రమ నివాసితులు కువైట్ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా, మంత్రిత్వశాఖ ఈ తేదీకి పొడిగింపును ప్రకటించింది మరియు ఫిబ్రవరి 23 వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు కొత్త అమ్నెస్టీ చెల్లుబాటు అవుతుంది. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీని ఉపయోగించుకోవడానికి ఈ దేశంలో చెల్లుబాటు అయ్యే పత్రం లేకుండా భారత ప్రవాసీయులందరిని భారత రాయబార కార్యాలయం జ్ఞాపకం చేసింది. ఈ క్షమాబిక్ష కాలంలో దేశం విడిచిపెట్టినట్లయితే, వారు సాధారణ నియమ నిబంధనలను అనుగుణంగా వ్యవహరిస్తే మళ్లీ కువైట్ లోకి ప్రవేశించటానికి అనుమతించబడతారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినవారికి ఈ మినహాయింపు లభిస్తుందని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com