మస్కట్ లో విదేశీ వీధి విక్రేతలపై అధికారుల దాడి పలు కేసుల నమోదు
- February 21, 2018
మస్కాట్ : బతుకుతెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన కొందరు కార్మికులు మస్కట్ నగరంలో కలుషిత ఆహార పధార్ధాలతో స్థానిక సంతలను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. వీరి బెడదను ఎలాగైనా వదిలించుకోవడానికి మునిసిపల్ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు పలు చోట్ల నిర్వహిస్తూ విదేశీ వీధి విక్రేతలను కట్టడి చేసేందుకు పలు యత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో జరిగిన ఈ దాడులలో 18 ఆరోగ్య ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు, 913 కిలోల కూరగాయలు, 209 కిలోల చేపలు మరియు 1,015 కిలోల వివిధ రకాల పండ్లను ఈ సందర్భంగా నాశనం చేశారు. మస్కాట్ లో ముత్తాఖ్ అల్ కుబ్రాలోని అనేక మంది కార్మికులు చట్టవిరుద్ధంగా రెండు టన్నుల ఆహార పదార్థాలను విక్రయించే వారిని గుర్తించారు. ఈ సమాచారంను మస్కట్ మున్సిపాలిటీ ఆన్లైన్ లో సైతం పేర్కొంది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







