నిత్యా మీనన్ మరో వినూత్నమూవీ 'ప్రాణ'..

- February 21, 2018 , by Maagulf
నిత్యా మీనన్ మరో వినూత్నమూవీ  'ప్రాణ'..

నిత్యా మీనన్ మరో వినూత్న చిత్రంలో నటించింది.. ఈ మూవీ మొత్తం ఒకే ఒక్క పాత్ర ఉండటం విశేషం.. ప్రాణ పేరుతో ఈ చిత్రాన్ని మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వి.కె. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్, నిత్యామీనన్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సౌండ్ డిజైనింగ్ ఈ సినిమా ప్రత్యేకతని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమా కోసం 'సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. డబ్బింగ్ అనేది లేకుండగా షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ రికార్డు అవుతాయని అంటున్నారు. "నాలుగు భాషల్లో రూపొందుతున్నందు వలన ఒక్కోసారి ఒక్కో భాషలో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది .. కష్టమే అయినా తప్పలేదు" అని తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందనే ధీమాను వ్యక్తం చేసింది నిత్యా..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com