కువైట్ లోని రహదారులన్నింటిని నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తారు
- February 21, 2018_1519218072.jpg)
కువైట్:కువైట్ లోని అన్ని ప్రధాన రహదారులు నిఘా కెమెరాల సహాయంతో వారంలో 24 గంటల పాటు పర్యవేక్షణను కొనసాగిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్రాఫిక్ వ్యవహారాల సహాయక సహాయమంత్రి మేజర్ జనరల్ ఫహ్ద్ అల్ షువేవా తెలిపారు. ట్రాఫిక్ విభాగం 269 స్థిర , సంచార కెమెరాలతో పాటు179 ఉన్నత సాంకేతికతతో కూడిన ప్రత్యేకమైన కెమెరాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో అమర్చబడ్డాయి. రోజువారీగ 190 నుంచి 200 ట్రాఫిక్ వైవిధ్యమైన ప్రమాదాలు జరిగే చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.2017 లో జెనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 70,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేసింది, దాని ఫలితంగా 428 మంది ప్రజలు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయారు. అలాగే, 10,000 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా లైసెన్సు లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన 164 మంది ప్రవాసీయులను దేశం నుండి పంపించవేయబడ్డారు. తీవ్రమైన ఉల్లంఘనలను మంత్రిత్వ శాఖ ఎట్టి పరిస్థితులలో సహించబోదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!