మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ : యూఏఈలో తొలి హాస్పిటల్‌

- February 21, 2018 , by Maagulf
మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ : యూఏఈలో తొలి హాస్పిటల్‌

యూఏఈ హాస్పిటల్‌ ఒకటి తొలిసారిగా లివర్‌, హార్ట్‌, లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సేవల్ని అందించనుంది. ఈ తరహా వైద్య చికిత్సల కోసం ఇప్పటిదాకా విదేశాలకు వెళ్ళాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ సమస్య ఉండదు. అబుదాబీలోని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో తొలిసారిగా మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ని తాము నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఆసుపత్రి నిర్వాహకులు. క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ అబుదాబీలో ఇప్పటిదాకా కిడ్నీ మార్పిడి చికిత్సలు మాత్రమే జరుగుతున్నాయి. షేక్‌ ఖలీఫా మెడికల్‌ సిటీలోనూ ఈ తరహా వైద్య చికిత్సలు అందుతున్నాయి. ఫిబ్రవరి 1న యూఏఈలో తొలిసారిగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స జరిగింది. డాక్టర్‌ ఆంటోనియో పిన్నా నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స నిర్వహించారు. మరో పది రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 11న దేశంలోనే తొలిసారిగా లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ని డాక్టర్‌ రెధా సోలియామాస్‌ నేతృత్వంలో నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ అబుదాబీ తొలి పూర్తి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సను నిర్వహించడం జరిగింది. విజయవంతమైన శస్త్ర చికిత్సలు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనీ, ముందు ముందు ఇలాంటి చికిత్సలు ఇంకా నిర్వహిస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. యూఏఈ హెల్త్‌ టూరిజంకి కేంద్రంగా మారబోతోందని వారు అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com