ఒమన్‌లో రెండు కొత్త మాల్స్ ఈ ఏడాదిలోనే!
- February 21, 2018
మస్కట్: రిటెయిల్ మరియు హాస్పిటాలిటీ సెక్టార్లో పేరుగాంచిన ల్యాండ్ మార్క్ గ్రూప్, ఒయాసిస్ మాల్ని సోహార్ మరియు సలాలాలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జీసీసీ దేశాల్లో ఏడు మాల్స్, ఫిలిప్పీన్‌లో నాలుగు మాల్స్‌ని నిర్వహిస్తున్న ఒయాసిస్ మాల్, 2018 నాటికి ఒమన్‌లో రెండు కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనుంది. సోహార్‌లోని అల్ వకిబా, అలాగే సలాలాలోని స్క్వేర్ జి - న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకటి ఈ ఏడాది ప్రారంభమవుతాయి. 33 చదరపు మీటర్ల వైశాల్యంలో సోహార్, 35,000 చదరపు మీటర్ల వైశాల్యంతో సలాలాలో ఈ మాల్స్ నిర్మితమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వ హంగులతో ఈ మాల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ల్యాండ్ మార్క్ గ్రూప్‌కి సంబంధించి ఈ మాల్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైనవని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కంట్రీ ఓవరాల్ ఎకానమీకి తమవంతుగా ఊతమిచ్చేలా ఈ మాల్స్ నిర్వహణ ఉంటుందని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







