ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

- February 21, 2018 , by Maagulf
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన  కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

ఫేస్‌బుక్ సృష్టిక‌ర్తకే షాక్ ఇచ్చిన  కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ఒక్క క‌న్ను కొట్టి కోట్లాది అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఒరు ఆదార్ లవ్’ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేట‌స్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మ‌డిని ఫాలో అయ్యే వారి సంఖ్య మ‌రింత పెరుగుతూ వ‌స్తుంది. ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని క్రాస్ చేసిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ని మించిపోయింది. ఆయ‌నికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేర‌ళ కుట్టికి 4.5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైన ఫోటో పోస్ట్‌చేసిన లేదంటే వీడియో అప్‌లోడ్ చేసిన మిలియ‌న్స్‌కి పైగా లైకులు, వ్యూస్ వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవ‌రికి అంత‌నంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మ‌డికి ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్స్ కూడా క్యూ క‌డుతున్నాయి. టాలీవుడ్‌లో నిఖిల్ స‌ర‌స‌న నటించే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తుండ‌గా , దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com