మస్కట్ న్యూ ఎయిర్‌పోర్ట్‌లో మార్చి 19 నుంచి కార్గో ఆపరేషన్స్
- February 21, 2018
మస్కట్: మస్కట్ కొత్త ఎయిర్‌పోర్ట్‌లో కార్గో బిల్డింగ్ ఆపరేషన్స్ మార్చి 19 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానున్నాయని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) వెల్లడించింది. ఎంఓటిసి వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 29 వరకు డెలివరీస్ మాత్రం ప్రస్తుత కార్గో బిల్డింగ్ నుంచి జరుగుతాయి. మార్చి 20 నుంచి మస్కట్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల ఆపరేషన్స్ ప్రారంభించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ఎంఓటిసి, ఒమన్ ఎయిర్ అలాగే ఇతర స్టేక్ హోల్డర్స్‌తో కలిసి అంతా సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ జాబి మాట్లాడుతూ, న్యూ కార్గో బిల్డింగ్‌లో సివిల్ వర్క్స్ పూర్తయాష్ట్ర్యయని చెప్పారు. టెక్నికల్ టెస్ట్‌లు జరుగుతున్నాయని తెలిపారాయన. 32,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేసిన కార్గో టెర్మినల్ ఏడాదికి 350,000 టన్నుల కార్గోని హ్యాండిల్ చేయగలదు. యానిమల్ కార్గో కోసం ప్రత్యేకంగా 2,500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. స్టాండెలోన్ డేంజరస్ గూడ్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. హై వాల్యూ కార్గో కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి