జి స్ టి వర్మను అరెస్టు చేయండి - సీఎం
- February 21, 2018
రాంగోపాల్ వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌పై మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. మహిళలను కించపర్చిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఆర్జీవీపై హైదరాబాద్‌లో కేసులు నమోదుకాగా.. ఇప్పుడు విశాఖ పోలీసులు సైతం ఆయనకు షాకిచ్చారు.
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరో షాక్ తగిలింది. జీఎస్టీ ఉచ్చు ఆయన మెడకు బిగుసుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసుల ఎదుట ఆర్జీవీ విచారణకు హాజరవ్వగా.. ఇప్పుడు ఏపీలో సైతం కేసులు నమోదయ్యాయి.
రాంగోపాల్ వర్మపై విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా సంఘాల ఆందోళనతో వర్మపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ని హోంమంత్రి చినరాజప్ప ఆదేశించారు.
అంతకుముందు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలంటూ విశాఖలో మహిళా జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు సామాజిక కార్యకర్త దేవి మద్దతు తెలిపారు. సీఎం చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటే... తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వర్మ తీసిన జీఎస్టీ చిత్రం అసభ్యకరంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉందంటూ సామాజిక ఉద్యమకారిణి దేవి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒకసారి రాంగోపాల్ వర్మను హైదరాబాద్ పోలీసులు విచారించారు. విచారణ కొనసాగనున్న నేపథ్యంలోనే తాజాగా విశాఖలో కేసు నమోదు కావడంతో... వర్మకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







