వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ఇవాంకా ట్రంప్
- February 22, 2018
ముగింపు వేడుకలకు ఇవాంకా ట్రంప్
ప్యాంగ్‌చాంగ్: దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్ ముగిం పు వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన ప్యాంగ్ చాంగ్ నగ రంలో జరిగిన ప్రారంభ వేడులకు అమెరికా వైస్ ప్రెసిడింట్ మైక్ పెన్స్ తన ప్రతినిధి బృందంతో హాజరైన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 24న జరిగే వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడులకు ఇవాంకా ట్రంప్ తన ప్రతినిధుల బృందంతో హాజరు కా నుంది. ఈసందర్భంగా ఇవాంకా ట్రంప్ మాట్లాడు తూ అమెరికా ప్రతినిధుల బృందంతో కలిసి ప్యాం గ్ చాంగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు హాజరు కావడం గౌరవంగా భావి స్తున్నా. టీమ్ యుఎస్‌ఏ అభినందించ బోతున్నం దుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. వింటర్ ఒలింపిక్స్‌లో వారి టాలెంట్, తెగింపు అమెరికాను ఉన్నతంగా నిలబెట్టింది.
మాకు స్పూర్తిగా నిలి చారని అన్నారు. వింటర్ ఒలింపిక్స్‌్ ముగింపు వేడులకు హాజరయ్యే అమెరికా ప్రతినిధుల బృం దంలో తూర్పు, దక్షిణ ఆసియా, టెర్రరిజంకు సంబంధించి సెనెట్ విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ ఛైర్మన్ జేమ్స్ ఈ రీచ్‌తో పాటు ప్రెస్ సెక్ర టరీ సారా హెచ్ శాండర్స్.యునైటెడ్ నేషన్స్ కమాండ్ కమాండర్ జనరల్ విన్సెంట్ కె బ్రూ క్స్‌లు ఉన్నారు. సెనెట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ అమెరికా ప్రతినిధుల బృందం వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొ న్న అమెరికా అథ్లెట్లను అభినందించడంతో పాటు అమెరికా-దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలపై కూడా చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







